Panchayat Elections | అలా చేస్తే.. నిధులు తీసుకువస్తా..

Panchayat Elections | అలా చేస్తే.. నిధులు తీసుకువస్తా..
Panchayat Elections, బిక్కనూర్, ఆంధ్ర ప్రభ : బిక్కనూరు పట్టణ అభివృద్ధి చేసే అవకాశం కల్పించాలని పట్టణ కాంగ్రెస్ (Congress) సర్పంచ్ అభ్యర్థి బల్యాల రేఖా సుదర్శన్ కోరారు. సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సర్పంచిగా పోటీ చేయడం జరుగుతుందన్నారు. మీ బిడ్డగా తమను ఆశీర్వదించాలని ఆమె కోరారు. పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ (Shabbir Ali) సహకారంతో పట్టణ అభివృద్ధి కోసం అత్యధిక నిధులు తీసుకువస్తానని చెప్పారు. తమ పై దయవుంచి సర్పంచిగా గెలిపించాలని ఆమె కోరారు.
