Pamphlet invention | జాతర శోభకు శ్రీకారం..

Pamphlet invention | జాతర శోభకు శ్రీకారం..
- పార్వతీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల కరపత్రం ఆవిష్కరణ.
Pamphlet invention | మునుగోడు, ఆంధ్రప్రభ : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ శ్రీ శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల (జాతర) కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం ఈరోజు నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కొంపల్లి గ్రామంలోని శివాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. కరపత్ర దాతలైన మొగుదాల శంభు–మౌనిక, వడ్డేపల్లి దుర్గాప్రసాద్–లావణ్య దంపతుల ఆహ్వానం మేరకు ఆలయ కమిటీ చైర్మన్ వెదిరె విజేందర్ రెడ్డి, కమిటీ సభ్యులు, క్రితిక హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ మొగుదాల నరసింహ గౌడ్, గ్రామ సర్పంచ్ జీడిమెట్ల నిర్మలా దశరథ చేతుల మీదుగా కరపత్రాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ వెదిరె విజేందర్ రెడ్డి మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.ప్రత్యేక పూజలు,అభిషేకాలు, రథోత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై జాతరను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు,గ్రామ పెద్దలు, మహిళా సంఘాల ప్రతినిధులు,యువజన సంఘాల సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
