Palakurthi | ఉద్యోగ భద్రత కల్పించాలి

Palakurthi | ఉద్యోగ భద్రత కల్పించాలి
Palakurthi | పాలకుర్తి, ఆంధ్రప్రభ : పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలో పనిచేస్తున్న ఈ-పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లకు డిసెంబర్ 2025తో పాటు జనవరి 2026 నెలలకు సంబంధించిన నాలుగు నెలల వేతనాలు బకాయిగా ఉండటంతో ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేతనాలు వెంటనే చెల్లించడంతో పాటు ప్రత్యేక జీఓ జారీ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం ఎంపీడీవో శశికళకు కంప్యూటర్ ఆపరేటర్ తిరుపతి సమ్మె నోటీసులు అందజేశారు. రాష్ట్రంలోని 32 జిల్లాల్లో 1,579 మంది ఆపరేటర్లు 2015 నుంచి గ్రామపంచాయితీల్లో విధులు నిర్వహిస్తూ ప్రభుత్వ పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఈ నెల 28 నుంచి విధుల బహిష్కరణ చేపట్టి, ఫిబ్రవరి 11 నుంచి రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత సమ్మెకు దిగుతామని తెలిపారు.
