PADMA | మీ ఇంటి బిడ్డగా ఆశీర్వదించండి…
PADMA | బిక్కనూర్, ఆంధ్రప్రభ : మీ ఇంటి ఆడబిడ్డగా తమను ఆశీర్వదించాలని జంగంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి పద్మా నరసింహులు యాదవ్ కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… తన భర్త నర్సింలు యాదవ్ స్ఫూర్తితో సర్పంచిగా పోటీ చేయడం జరుగుతుందన్నారు. గ్రామంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావడం జరిగిందని తెలిపారు. తమపై నమ్మకంతో గ్రామ సర్పంచిగా గెలిపించాలని ఆమె కోరారు. 24 గంటలు గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. కామారెడ్డి జిల్లాలో జంగంపల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందిస్తానని హామీ ఇచ్చారు. మహిళా సంఘాలు, కుల సంఘాలు, యువజన సంఘాలు తమకు అండగా నిలవాలని ఈ సందర్భంగా కోరారు.

