బెజ్జోరాలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్ మండలం బెజ్జోరా గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ మెస కార్తీక్, ఉప సర్పంచ్ మూడేడ్ల లింబయ్య,కాంగ్రెస్ నాయకుల సమక్షంలో ప్రారంభమైన ఈ కేంద్రం రైతులకు ఉపయోగకరంగా ఉండనుంది. రైతులు తమ వరి ధాన్యాన్ని నేరుగా ప్రభుత్వానికి విక్రయించుకునే అవకాశాన్ని ఈ కేంద్రం కల్పిస్తుంది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రైతులు మధ్యవర్తులను ఆశ్రయించకుండా నేరుగా కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు జరుగుతుందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం ప్రమీల, సీనియర్ ఐకేపీ సీసీలు కుంట శ్రీనివాస్, పురస్తు నరేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బీ. స్వామి, మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు పర్స అనంతరావు, కౌన్సిలర్ మామరి సందీప్,సర్పంచ్ కార్తీక్, ఉప సర్పంచ్ మూడేడ్ల లింబయ్య, వివిధ గ్రామాల సర్పంచ్ లు,శివ, అరిగెల జనార్ధన్, రెడ్డి,అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
