నీట మునిగిన వరి పంట

నీట మునిగిన వరి పంట

మోత్కూరు, నవంబర్ 3 (ఆంధ్రప్రభ) : యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా మోత్కూరు మండల పరిధిలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మండలంలోని సదర్శాపురం , కొమ్మూరోళ్ల బావి పరిసర ప్రాంతాల్లోని చెరువుకింద ఉన్న వరి పొలాలు ముంపుకు గురయ్యాయి.

ఈ ముంపుతో రైతులు భారీ నష్టాల(Huge losses) ను ఎదుర్కొంటున్నారు. చేతికి అందివచ్చిన పంటలు కాస్త నీతమునగడంతో రైతులు ఆరుగాలం శ్రమించి పెట్టిన పెట్టుబడులు కాస్త కష్టతరమే అని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన రైతులు దొండ శ్రీశైలం, కుమ్మరి కరుణాకర్ రెడ్డి, కొమ్మూరి వెంకటరెడ్డి, కొమ్మూరి నర్సిరెడ్డి, కొమ్మూరి యాదిరెడ్డి లకు చెందిన సుమారు 12 ఎకరాల వరి పంట పూర్తిగా నీట మునిగిపోయింది.

ముఖ్యంగా కొమ్మూరి యాదిరెడ్డి పొలం పూర్తిగా అడ్డం పడటంతో పంట మొత్తం నాశనమైపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే పంట నష్టాన్ని అంచనా వేసి, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.

Leave a Reply