overturned | ట్రాక్టర్ బోల్తా… తప్పిన పెను ప్రమాదం..

overturned | వెల్దండ, ఆంధ్రప్రభ : కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ (కేఎల్ ఐ) కాలువలో ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన మండలంలోని చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే వెల్దండ మండల సమీపంలోని బర్కత్ పల్లి గ్రామానికి చెందిన గడిగ మల్లేష్(32) ఈ రోజు ఉదయం ట్రాక్టర్ సహాయంతో వ్యవసాయ పొలంలో మందు పిచికారి చేయడానికి వెళ్లే సమయంలో అదుపుతప్పి కే ఎల్ ఐ కాలువలో పడినట్టు తెలిపారు. డ్రైవర్ మల్లేష్ కు పెను ప్రమాదం తప్పడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం జేసీబీ సహాయంతో ట్రాక్టర్ ను బయటకి తీసినట్టు తెలియజేశారు.

Leave a Reply