పరిటాల కుటుంబాన్ని ఎక్కడైనా ఓడిస్తాం..!

పరిటాల కుటుంబాన్ని ఎక్కడైనా ఓడిస్తాం..!

మా టార్గెట్‌ పరిటాల కుటుంబం..!

రాప్తాడు,ఆంధ్రప్రభ : జగన్‌ చేయి నాభుజంపై ఉన్నంత వరకూ నా వెంట్రుక కూడా పీకలేరని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.గురువారం రాప్తాడు నియోజకవర్గంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సర్పంచులకు అనంతపురం కళ్యాణదుర్గం రోడ్డులోని రజాక్‌ ఫంక్షన్‌ హాల్ నందు సన్మాన సభ ఏర్పాటు చేశారు.ఈ సంధర్భంగా ఆరు మండలాలకు చెందిన సర్పంచులను మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు.

అనంతరం మాట్లాడుతూ కరోనా కష్టకాలం ఆదాయం లేకపోవడం నిధుల లేక రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల కారణంగా గ్రామాల్లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదు. అయితే జగన్‌ మోహన్‌రెడ్డి ఐదేళ్ళు చాలా క్రమశిక్షణతో ప్రభుత్వాన్ని నడిపారు. నాకు జగన్మోహన్ రెడ్డి కి ఉన్న అనుబంధం భగవంతుడు భక్తుడికి ఉన్న అనుబంధం లాంటిది.నన్ను చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పెట్టాలని చూశారు. అయితే జగన్మోహన్ రెడ్డి చేయి నాభుజంపై ఉన్నంతకాలమూ నా వెంట్రుక కూడా పీక్కోలేరు అని అన్నారు.

నేను రాజకీయాల్లోకి రాకముందే అనేక సేవా కార్యక్రమాలు చేపట్టాను. పేద రైతులకు ఉచితంగా బోర్లు ఉచితంగా గొర్రెలు బర్రెలు ఇప్పించాము.పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకొచ్చేందుకు ఉద్యమాలు చేశాము.ఈ డ్యాంకు నీళ్లు తీసుకురావడం అనేది తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డికి ఒక కల. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత జగనన్న అండతో ఆ కల సాకారం చేసి నిరూపించాను.మా మనసులో పేదల పట్ల ప్రేమ వెనుకబడిన వారిని ఆదుకోవడం ఈ ప్రాంతాన్ని కరువు నుంచి విముక్తి చేయాలనే తపన తప్ప వేరే ఆలోచన ఉండదన్నారు.

పరిటాల కుటుంబం అంటే ప్రజల్లో ఇప్పటికీ భయం ఉంది. ఆ భయాన్ని మేము చంపుతూ వచ్చాము. వాళ్లు ప్రజలను భయపెడుతూ రాజకీయం చేస్తున్నారు.మేమైతే ఎవరినీ చంపకుండా రాజకీయం చేస్తున్నాము. అలాంటి వాళ్లతో లోపాయికారి ఒప్పందం చేసుకుంటున్న వైసిపి నాయకులు కొందరిపై చర్యలు తీసుకుంటాము. పరిటాల కుటుంబం ధర్మవరం పోయినా పెనుకొండకు పోయినా రాప్తాడు నుంచి పోటీ చేసినా ఓడించి తీరుతామన్నారు.నేను ఉచితంగా బోర్లు వేయించడంతో లీడర్లు అయినా పిల్లికి బిచ్చం పెట్టని వాళ్ళు ఈరోజు ఎమ్మెల్యే కావాలనుకుంటున్నారు.

నేను ఆర్థికంగా చెడిపోయి రైతుల మేలు కోసం పని చేశాను. నా త్యాగానికి వెలగట్టలేరు.నేను జనాలకు ప్రేమతో దగ్గరయ్యాను.పరిటాల కుటుంబంలా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి జనాలకు దగ్గరకాలేదు.నాలాంటి ప్రేమను చంపడానికి పరిటాల కుటుంబం తరం కాదన్నారు.అయితే నన్ను ఆర్థికంగా చంపారు. మానసికంగా చంపారని అన్నారు.మా త్యాగాలు గుర్తించండి. ఎంపీటీసీ సర్పంచుల ఎన్నికలకు మావంతు సహాయ సహకారాలు అందించాము.చేతనైన మేరకు సాయం చేశాము.

మీ గౌరవం నిలబడేలా గుడికో బడికో ఆస్పత్రులు ఇతర వాటికోసమే కోట్లాది రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు. మీరు పిలుచుకొచ్చి అన్నా వీరి పరిస్థితి ఇదీ అంటే మాకు చేతనైన మేరకు సాయం చేసి ఉంటాము.నేటికీ అద్దె ఇంట్లోనే ఉంటున్నాము.అలాంటి మాకుటుంబంపై దుర్మార్గంగా విషప్రచారం చేస్తున్నారు.క్యారెక్టర్‌ను చంపుకుని రాజకీయం చేయాల్సిన అవసరం మా కుటుంబానికి లేదన్నారు. డబ్బు శ్రమ ఆరోగ్యం కష్టం అంతా ప్రజల కోసమే పెట్టామని చెప్పారు.


వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేయమని భావించే పరిటాల కుటుంబం రాప్తాడు అనంతపురం రూరల్ ఆత్మకూరు మండలాల్లో దోపిడీ చేస్తోందన్నారు.మేము ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాటాలు చేస్తుంటే కొందరు అక్రమ ఆదాయాల కోసం అవతలివాళ్ళలో చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఎన్నికల్లో మనకు ద్రోహం చేసి పార్టీలో సస్పెండ్‌ అయిన వాళ్ళని వెంట బెట్టుకుని తిరిగేవాళ్ళని తిప్పులాడిచి చెప్పు తిరగేసి కొట్టాలని అన్నారు.మాలో కూడా కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. నేను సాధ్యం కాదంటే మా చందు అన్న వద్దకు వెళతారు. ఆయన భోలాశంకరుడు ఎవరు వచ్చినా కాదనకుండా పని చేసి పెడతాడు.

ఆ పని చేయొచ్చా చేయకూడదా దానివల్ల మనకు మంచిపేరు వస్తుందా అనేది కూడా ఆలోచించకుండా పని చేసిపెడతాడు. ఒకవేళ ఆయన కూడా ఈ పని చేయలేనని చెబితే మాపెద్దన్న వద్దకు వెళ్తారు. ఇలా మూడుగుర్రాల స్వారీ చేసి నష్టపోతున్నాము.గత ఐదేళ్లలో మా ఇంటి నుంచి జరిగిన కొన్ని పొరబాట్ల వల్ల కొందరు ఈరోజు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏ కోశాన కూడా వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీకి సంబంధం లేదు.

జీవితకాలంలో వాళ్ళు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మెట్లు ఎక్కే అర్హత లేదు. ఇది శాశ్వత బహిష్కరణ అని అన్నారు. మన టార్గెట్‌ పరిటాల కుటుంబం.మనం శత్రువుని ఎదుర్కొవాలంటే నమ్మకమైన సైన్యం ఉండాలని తెలిపారు. ఈసారి 262 అసెంబ్లీ సీట్లు పెరుగుతున్నాయి. గ్రేటర్‌ రాయలసీమలో 111 అసెంబ్లీ సీట్లు ఉంటాయి. ఇందులో కనీసం 106 సీట్ల దాకా గెలవబోతున్నాము.ఇది దోపిడీ ప్రభుత్వం. నీరుచెట్టు ఉపాధి హామీ ద్వారా దోపిడీ చేస్తోంది. మట్టి ఇసుక అమ్ముకుంటోంది. మద్యం ఏరులై పారుతోందన్నారు.


ప్రస్తుతం సర్పంచులుగా పని చేసిన వారందరికీ రానున్న రోజుల్లో ప్రమోషన్లు స్థాయిలో గుర్తింపు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాప్తాడు వైస్ ఎంపీపీ బోయ రామాంజనేయులు కన్వీనర్ మరూరు వెంకటేష్ బొమ్మెపర్తి సత్యనారాయణ రెడ్డి ఆరు సర్పంచులు మండలాల కన్వీనర్లు ఎంపీపీలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply