గెలిచిన – ఓడిన ప్రజా సేవే మా లక్ష్యం..

పరకాల, ఆంధ్రప్రభ : గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రజా సేవలో ప్రజల సమస్యల పరిష్కారానికై పరితపిస్తున్న మాజీ కౌన్సిలర్ రజినీ నవీన్ ఎల్లవేళల సిద్ధంగా ఉంటున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పరకాల 17వ వార్డు నుండి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా శనిగరం రజినీ నవీన్ పోటీ చేసి కేవలం ఒకే ఒక బ్యాలెట్ ఓటుతో ఓడిపోయినప్పటికీ నిరాశ చెందకుండా తమ లక్ష్యం ప్రజా సేవ అని ప్రజలే తమకు దైవం అని మాజీ కౌన్సిలర్ శనిగరం రజినీ నవీన్ అంటున్నారు.
గతంలో పరకాల పురపాలక సంఘం 13వ వార్డు కౌన్సిలర్ గా తాము చేసిన పనులను గుర్తించి రిజర్వేషన్ లో భాగంగా ప్రజల కోరిక మేరకు పార్టీ ఆదేశానుసారం 17వ వార్డులో పోటీ చేసి కేవలం ఒక ఓటు తో ఓడిపోయినప్పటికీ తాము నమ్మిన ప్రజల కోసం ఓటు వేసిన ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని, కష్టసుఖాలలో మరియు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తమ లక్ష్యం ప్రజా సేవ అని అన్నారు.
ఓడిపోయిన అభ్యర్థి ఈ విధంగా ఇటీవల వార్డులో మరణించిన కుటుంబలను పరామర్శించి సహాయం చేస్తున్న శనిగరం రజినీ నవీన్ వార్డు ప్రజల కోసం స్పందించే విధానం పై పరకాల పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనప్పటికీ ప్రజలు రజినీ నవీన్ స్పందన పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నాయకులు ప్రజాక్షేత్రం లో ముందుకు సాగాలని కోరుకుంటున్నారు.
