Orkonda | జేఏసీ నాయకుల ముందస్తు అరెస్టు

Orkonda | ఊర్కొండ, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని ఊరుకొండపేట బ్రహ్మోత్సవాలకు విచేయుచున్న జడ్చర్ల శాసనసభ్యుడు జనంపల్లి అనిరుద్ రెడ్డి పర్యటన సందర్భంగా ఉర్కొండ మండలాన్ని కల్వకుర్తి రెవెన్యూ డివిజన్లోనే ఉంచాలని గత పది రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న జెఏసి నాయకులు ఎమ్మెల్యే పర్యటనను అడ్డుకుంటాం అని పిలుపునిచ్చిన నేపధ్యంలో సోమవారం రాత్రి సిఐ నాగార్జున, ఎస్సై కృష్ణదేవ ఆధ్వర్యంలో తమ సిబ్బందితో జేఏసీ నాయకులను ముందస్తు అరెస్టు చేసి కల్వకుర్తికి తరలించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ… ముందస్తు అరెస్టులతో మా ఉద్యమాన్ని ఆపలేరని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు నిరంజన్ గౌడ్, శ్యాంసుందర్ రెడ్డి, దివాకర్ గౌడ్, తాడేం చిన్న, అరవింద్ గౌడ్ తదితరులు ఉన్నారు.
