త‌క్ష‌ణ‌మే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు.. ఎస్పీ శరత్చంద్ర పవర్

త‌క్ష‌ణ‌మే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు.. ఎస్పీ శరత్చంద్ర పవర్

చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల పట్టణ కేంద్రంలోని జాతీయ రహదారి 65 పై ఉన్న రైల్వే బ్రిడ్జి వద్ద తరచుగా ట్రాఫిక్ జామ్(Traffic jam) అవుతున్నందున దానికి గల కారణాలను తెలుసుకునేందుకు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్(Sarathchandra Power) ఈ రోజు స్వయంగా ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షపు నీరు ఫ్లోటింగ్ ఎక్కువ కావడంతో వరద నీరు రైల్వే బ్రిడ్జి కింద లోతట్టుగా ఉండటం వల్ల నీరు బయటకి వెళ్లకపోవడం చేతే వరద నీరు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్‌కు కారణం అవుతుందని, ఈ ట్రాఫిక్ జామ్ వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.

వర్షపు నీరు నిలవకుండా ఎప్పటికప్పుడు వెళ్లిపోయేలా శాశ్వత చర్యలు తీసుకొని జాతీయ రహదారి(National Highway)పై మళ్ళీ ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చూడాలని సంబంధిత ఎన్ హెచ్ఎఐ(NHAI), మున్సిపల్, రెవెన్యూ అధికారులకు సూచించారు. ఆయనతోపాటు నల్గొండ డి.ఎస్.పి శివరాంరెడ్డి, నార్కట్పల్లి సిఐ నాగరాజు, ఎస్ ఐ మామిడి రవికుమార్ లు ఉన్నారు..

Leave a Reply