ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విధ్వంసం సృష్టించింది. ఆర్‌ఆర్ బౌలర్లకు పగలే చుక్కలు చూపిస్తూ.. హైదరాబాద్ బ్యాటర్లు చెలరేగిపోయారు. గత సీజన్ రన్నరప్‌తో సరిపెట్టుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి మరింత కసితో ఆడుతోంది.
ఆరెంజ్ ఆర్మీ అభిమానులతో కిక్కిరిసిన ఉప్పల్ స్టేడియంలో… ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లు ఊచకోత కోశారు. దీంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు నమోదు చేసింది హైదరాబాద్ జట్టు.
ఈ క్రమంలో ఎస్ఆర్‌హెచ్ రికార్డు క్రియేట్ చేసింది. ఈ సీజన్ తొలి మ్యాచ్ లోనే.. ఐపీఎల్ చరిత్రలో రెండవ అత్యధిక జట్టు స్కోరును నమోదు చేశారు. అయితే, ఈ జాబితాలో మొదటి మూడు స్థానాల్లో హైదరాబాద్ జట్టు ఉండటం గమనార్హం.
ఐపీఎల్‌లో అత్యధిక ఇన్నింగ్స్ స్కోర్లు:
- ఆర్సీబీపై ఎస్ఆర్‌హెచ్ 287/3 – బెంగళూరు 2024
- రాజస్థాన్ పై ఎస్ఆర్‌హెచ్ 286/6 – హైదరాబాద్ 2025 (ఈరోజు)
- ముంబై ఇండియన్స్ పై ఎస్ఆర్‌హెచ్ 277/3 – హైదరాబాద్, 2024
- ఢిల్లీపై కోల్‌కతా 272/7 – విశాఖపట్నం, 2024
- ఢిల్లీపై ఎస్ఆర్‌హెచ్ 266/7 – ఢిల్లీ 2024
ఐపీఎల్‌లో ఎస్ఆర్‌హెచ్ అత్యధిక ఇన్నింగ్స్ స్కోర్లు:
- బెంగళూరులో ఆర్సీబీపఐ 287/3, 2024
- హైదరాబాద్‌లో ఆర్ఆర్ పై 286/6 2025 (ఈరోజు)
- హైదరాబాద్‌లో ముంబైపై vs 277/3, 2024
- ఢిల్లీలో ఢిల్లీ క్యాపిటల్స్ పై 266/7 2024
- హైదరాబాద్‌లో ఆర్సీబీపై 231/2 2019