అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు

అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు

బెజ్జంకి, అక్టోబర్ 22(ఆంధ్రప్రభ): అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు బుధవారం బెజ్జంకి మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు విద్యార్థులకు పోలీస్ శాఖ కార్యకలాపాలు, నేరాల నివారణ, ప్రజల రక్షణలో పోలీసుల పాత్ర పై అవగాహన కల్పించారు. అలాగే విద్యార్థులు పోలీసులను ఆసక్తిగా పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సిఐ శ్రీను, ఎస్‌ఐ సౌజన్య, సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply