Ootkur | ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

Ootkur | ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

Ootkur | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలో మూడో విడత జరిగిన 20 గ్రామ పంచాయతీలకు సర్పంచ్ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా కొనసాగాయి. ఓటు వేసేందుకు ఓటర్లు ఉదయమే పోలింగ్ కేంద్రాల వద్ద బారులుతీరారు. వివిధ గ్రామాల నుండి వలస వచ్చిన పలువురు ఓటర్లు రెండు నిమిషాల ముందు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల్లోకి పరుగులు తీశారు. పోలింగ్ ప్రక్రియను నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్, డి.ఎస్.పి లు నల్లపు లింగయ్య, మహేష్, తాసిల్దార్ చింత రవి, ఎంపీడీవో కిషోర్ కుమార్, ఎస్ఐ రమేష్ తో పాటు పలువురు అధికారులు పోలింగ్ సరళిని పరిశీలించారు.

Ootkur

ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద వృద్ధులు, వికలాంగులను గ్రామపంచాయతీ పోలీసు సిబ్బంది పోలింగ్ కేంద్రాల్లోకి ఓటు వేసేందుకు వీల్ చైర్ లలో తరలించారు. ఊట్కూర్ లో7554 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోగా పురుషులు3743 మంది పురుషులు, 3811 మంది స్త్రీలు తమ ఓటు హక్కు వినియోగించుకోగా 74శాతం పోలింగ్ నమోదయింది. ఊట్కూర్ 11వ పోలింగ్ బూత్ లో ఓ మహిళ డబుల్ ఓటు వేసేందుకు వచ్చిందని అభ్యంతరం వ్యక్తం చేయడంతో కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ఊట్కూర్ మండల కేంద్రంలో మాజీ జెడ్పి వైస్ చైర్మన్ గరిడినింగి రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు బాల్ రెడ్డి, మాజీ ఎంపీపీలు ఎల్కోటి లక్ష్మి నారాయణరెడ్డి వెంకట్రామిరెడ్డి, మాజీ జెడ్పిటిసిలు సూర్యప్రకాశ్ రెడ్డి మనెమ్మ అరవింద్ కుమార్, ఊట్కూర్ లో సర్పంచ్ అభ్యర్థులు సుజాత, రేణుక, జయప్రద, రోషణమ్మ, శ్వేత, తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Ootkur

Leave a Reply