Ootkur | మంత్రి సహకారంతో గ్రామాభివృద్ధి

Ootkur | మంత్రి సహకారంతో గ్రామాభివృద్ధి

  • మంత్రి చొరవతో తీరిన తాగునీటి సమస్య

Ootkur | ఊట్కూర్, ఆంధ్రప్రభ : మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలు సత్వరమే పరిష్కరించి ప్రజల రుణం తీర్చుకుంటానని తిప్రాసుపల్లి సర్పంచ్ విజయలక్ష్మి నరసింహ అన్నారు. ఇవాళ‌ నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని తిప్రాసుపల్లిలో మంత్రి సహకారంతో బోరువేశారు.

ఈసందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ… గత కొన్నేళ్లుగా గ్రామంలో తాగునీటి ఇబ్బంది తలెత్తిందని మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా, వెంటనే మంత్రి బోర్ వేయించి నీటి సమస్య తీర్చాలని సూచించడంతో బోర్ వేసినట్లు తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో గెలుపొందానని, ఉన్నత చదువు చదవడంతో ప్రతి సమస్యపై అవగాహన ఉందని, గ్రామంలో నెలకొన్న సమస్యలు దశలవారీగా పరిష్కరిస్తానన్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవ చేస్తానన్నారు.

నూతనంగా వేసిన బోరులో పుష్కలంగా నీరు రావడంతో నీటి సమస్య తీరిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సూర్యప్రకాశ్ రెడ్డి, నాయకులు పి.శంకర్, భగవంతు కిష్టప్ప, రాజు, ఆంజనేయులు, సత్యనారాయణ, కోరం మహేష్ రెడ్డి, కొక్కు శంకర్, రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply