చంద్రగ్రహణం ఆలయాలు మూసివేత..

చంద్రగ్రహణం ఆలయాలు మూసివేత..
ఒంగోలు కల్చరల్, ఆంధ్రప్రభ : ప్రకాశం జిల్లా ఒంగోలు లో చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం నగరంలోని కేశవస్వామి పేటలోని కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం, ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానం, విజయ దుర్గ అమ్మవారి దేవస్థానం, వీరాంజనేయ స్వామి దేవస్థానం, లాయర్ పేట సాయిబాబా మందిరం, మంగమూరు రోడ్డు గాయత్రీ మందిరం, కొత్తపట్నం బస్టాండు తూర్పుపాలెం శివాలయం, బాలాజీ రావు పేట కనకదుర్గమ్మ పోలేరమ్మ దేవస్థానం, గంటపాలెం పార్వతమ్మ గుడి , మర్రి చెట్ల కాలనీ అభయాంజనేయ స్వామి దేవస్థానం.

కొత్తపట్నం బస్టాండ్ నల్లూరి నర్సి హోమ్ దగ్గర మహాలక్ష్మి దేవస్థానం, సంతపేట సాయిబాబా మందిరం మంగమూరు రోడ్డు హరిహర సుత అయ్యప్ప క్షేత్రం. సమతా నగర్ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం, రంగారాయుడు చెరువు దగ్గర కంచి కామాక్షమ్మ దేవస్థానం, సుబ్రహ్మణ్యస్వామి దేవస్థానం, కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, ఆలయ అర్చకులు ఉదయం ధూప దీప అర్చన హారతులు ఇచ్చి స్వామివారికి మహానివేదన జరిపి గర్భాలయాలను మూసివేశారు. తిరిగి గ్రహణాంతరం సాయంత్రం ఏడు గంటలకు ఆలయాన్ని గర్భాలయాన్ని స్వామి వారి మూలవిరాట్ ను శుద్ధిచేసి అనంతరం భక్తులకు దర్శనం ఏర్పాటు చేస్తారు.
