NZB | ట్రాక్టర్ పై నుండి పడి ఒక‌రు దుర్మరణం..

ఎడపల్లి, మార్చి 1(ఆంధ్రప్రభ ) : ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ శివారు ప్రాంతంలో నవీపేట్ రోడ్డు ధర్మాబాద్ మిర్చి పౌడర్ వర్తక సముదాయం సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

డస్ట్ లోడ్ తో వెళ్తున్న ట్రాక్టర్ పై ఉన్న వ్యక్తి ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పైనుండి కింద పడిపోవడంతో ట్రాక్టర్ ట్రాలీ చక్రం ఆ వ్యక్తిపై నుండి వెళ్ళడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు నవీపేట మండలం మిట్టపల్లికి చెందిన తెడ్డు శ్రీకాంత్(30) గా గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *