One Day Series | కివీస్‌తో వన్డే సిరీస్

One Day Series | కివీస్‌తో వన్డే సిరీస్
- జోరుగా టీమిండియా ఆటగాళ్ల ప్రాక్టీస్
One Day Series | వెబ్ డెస్క్ ( స్పోర్ట్స్), ఆంధ్రప్రభ : రేపటి నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఇందుకోసం టీమిండియా సమాయత్తమవుతోంది. మూడు మ్యాచుల సిరీస్‌లో విజయం సాధించేందుకు భారత ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇరు జట్ల మధ్య ఆదివారం తొలి వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలో భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఫుల్ ప్రాక్టీస్ చేస్తున్నారు.

నెట్స్‌లో ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. విరాట్, రోహిత్ పేసర్లు, స్పిన్నర్లను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత త్రోడౌన్ స్పెషలిస్ట్ బంతులను ప్రాక్టీస్ చేశారు. టీ20, టెస్టులకు గుడ్‌బై చెప్పిన ఈ ఇద్దరు వన్డేల్లో మాత్రమే ఆడుతున్నారు. ఈ దిగ్గజ ఆటగాళ్లు మంచి ఫాంలో ఉన్నారు. దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో వీరిద్దరూ చెరో రెండు మ్యాచ్‌లు ఆడి ఫామ్ చాటుకున్నారు. ఇటీవల దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌లో కోహ్లి రెండు సెంచరీలు చేశాడు.

న్యూజిలాండ్ కూడా అదే జోరు కొనసాగించాలని చూస్తున్నాడు. అంతగా ఫామ్‌లో లేని కెప్టెన్ శుభమన్‌గిల్ కూడా ఫుల్‌గా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో చివరి రెండు టీ20లకు దూరమైన అతడు… ఇప్పుడు పూర్తిగా కోలుకొని ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. వన్డే సిరీస్ అనంతరం భారత జట్టు న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ కూడా ఆడనుంది. ఆ వెంటనే ఐసీసీ టి20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది.

