నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్న అధికారులు..

నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్న అధికారులు..

సదాశివనగర్, ఆంధ్రప్రభ : ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం, సమస్యలను పరిష్కరించడంలో అధికారులు(Officers) అలసత్వం వహిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. సదాశివనగర్ మండల కేంద్రంలోని పాత చెరువు కట్టపై పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి ప్రమాదాలకు సూచికలుగా మారాయి.

చెరువు కట్టపై మూల మలుపులు ఎక్కువగా ఉండి, పిచ్చి మొక్కలు పెరగడంతో చెరువు కట్టపై వెళ్లే ప్రయాణికులు(passengers), రైతులు ఇబ్బందులను ఎర్కొంటున్నారు. గత సెప్టెంబర్ 21న పిచ్చి మొక్కలు తొలగించాలని “ఆంధ్రప్రభ’ లో కథనం ప్రచురితమైన విషయం విధితమే. నెల రోజులైనా చెరువు కట్ట సమస్యను పట్టించుకోకపోవడంతో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుంది. చెరువు కట్ట మీదుగా ద్విచక్ర వాహనాలు ఇతర వాహనాలపై వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు.

ఎదురెదురుగా వచ్చే వాహనాలు(vehicles) ఢీకొని రోడ్డు ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మేల్కొని పిచ్చి మొక్కల పొదలు తొలగించాలని కోరుతున్నారు.

Leave a Reply