NZB | శభాష్ శ్రీచందన…

- ‘గేట్’ ర్యాంకర్‌కు కలెక్టర్ అభినందనలు
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్ మండలం జాగిర్యాల్ గ్రామానికి చెందిన జి.శ్రీచందన గేట్ అర్హత పరీక్షలో ప్రతిభ కనబర్చిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆమెను అభినందించారు.
జి. దేవేందర్, స్రవంతి దంపతుల కుమార్తె అయిన శ్రీచందన గేట్ పరీక్షలో 81.67% మార్కులతో 302 ర్యాంకు సాధించింది. జిల్లాకలెక్టరేట్ సముదాయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
ఎలాంటి కోచింగ్ లేకుండా స్వయంగా ప్రిపేర్ అయ్యి.. తొలి ప్రయత్నంలోనే మంచి ర్యాంకు సాధించడం అభినందనీయమని కలెక్టర్ ప్రశంసించారు. ఇదే పట్టుదలతో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి, కుటుంబానికి, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆమెను ప్రోత్సహించారు.
