NZB | మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

బాల్కొండ (ఆంధ్రప్రభ): యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములవ్వాలని పోలీస్ కళాబృందం సభ్యులు సూచించారు. గురువారం బాల్కొండ మండల కేంద్రంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ప్రజలకు, వాహనదారులకు వివిధ అంశాలపై వారికి సూచనలు అందించారు.

ఎవరన్నా గంజాయి అమ్మిన, సేవించినట్లయితే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ, హెల్మెట్ ధరించి వాహనం నడపాలన్నారు. మద్యం సేవించి వాహనం నడిపితే పదివేల రూపాయల జరిమానాలతో పాటు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఏఎస్సై చిన్నయ్య, హెడ్ కానిస్టేబుల్ వాసుదేవ్, విడిసి అధ్యక్షుడు గుండ్రతి నడిపి పోశెట్టి, మర్కస్ కమిటీ అధ్యక్షుడు ఇఫ్తేకార్, మాజీ సర్పంచ్ తౌట్ గంగాధర్, వాకర్ అసోసియేషన్ అధ్యక్షుడు జెట్టి జనార్ధన్, కళాబృందం సభ్యులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply