మైనార్టీ గురుకుల అడ్మిషన్ మేళా… విశేష స్పందన

మైనార్టీ గురుకుల అడ్మిషన్ మేళా… విశేష స్పందన
జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మైనార్టీ బాలికల గురుకులంలో అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా జైనూర్ మండల కేంద్రంలోని జామా మస్జీద్ వద్ద ప్రత్యేక అడ్మిషన్ మేళా ఘనంగా నిర్వహించిన్నట్లు జైనూర్ మైనార్టీగురుకుల ప్రిన్సిపాల్ సూఫీయా నాజ్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సూఫీయా నాజ్ మాట్లాడుతూ, మైనార్టీ విద్యార్థులు గురుకుల విద్యను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.
గురుకులంలో అందిస్తున్న సౌకర్యాల గురించి వివరిస్తూ, విద్యార్థులకు పూర్తిగా ఉచిత విద్యతో పాటు వసతి, పోషకాహారం, యూనిఫార్మ్‌లు, పాఠ్యపుస్తకాలుఅందజేస్తున్నామని తెలిపారు. అదనంగా డిజిటల్ క్లాసులు, ఆధునిక సైన్స్ ల్యాబ్‌లు, క్రీడా సదుపాయాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీ పరీక్షలకు ప్రత్యేక కోచింగ్ కూడా అందిస్తున్నట్లు తెలిపారు.
అడ్మిషన్‌కు సంబంధించిన అర్హతలు, దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియపై విద్యార్థులు, తల్లిదండ్రులకు సమగ్ర అవగాహన కల్పించారు. ఈ మేళాకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరై తమ సందేహాలను నివృత్తి చేసుకోవడంతో పాటు గురుకుల విద్యపై ఆసక్తి వ్యక్తం చేశారు.
