Number 304 | ఆత్మహత్యాయత్నం

Number 304 | ఆత్మహత్యాయత్నం

Number 304 | నరసరావుపేట, ఆంధ్రప్రభ : పల్నాడు జిల్లా నరసరావుపేట వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని దినేష్ లాడ్జిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఇందులో భార్య, కూతురు మృతి చెందగా, భర్త విషమ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, డాక్టర్ కుంబా గోపి అనే వ్యక్తి నిన్న రాత్రి సుమారు 10 గంటల సమయంలో లాడ్జిలోని రూమ్ నెంబర్ 304ను తీసుకున్నారు. గోపి భోపాల్‌లో అనస్థీషియా డాక్టర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం.

Number 304 |

ఆయన భార్య శంకర కుమారి అదే ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుంది. ఆయన ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ దంపతులకు మూడు సంవత్సరాల పాప ఉంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, పాపకు డౌన్ సిండ్రోమ్ అనే వ్యాధి ఉండటంతో కుటుంబంలో కొంతకాలంగా మానసిక ఒత్తిడి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. నాదెండ్ల మండలం సాతులూరు గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం గోపి, తన భార్య, కూతురుతో కలిసి చేతులకు క్యాన్యులాలు పెట్టుకుని అనస్థీటిక్ లేదా ఇతర డ్రగ్స్‌ను ఇంజెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

Number 304 |

ఆత్మహత్యాయత్నానికి ముందు ఈ దృశ్యాలను కుటుంబ సభ్యులకు పంపించి, లాడ్జ్ లొకేషన్‌ను కూడా షేర్ చేసినట్లు సమాచారం. వెంటనే స్పందించిన గోపి సోదరుడు లాడ్జ్‌కు చేరుకుని, ముగ్గురినీ తక్షణమే ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భార్య, చిన్నారి మృతి చెందగా, గోపి ప్రస్తుతం చికిత్స పొందుతూ ప్రాణాలతో ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు విచారణలో వెల్లడి కావాల్సి ఉంది.

Number 304 |

click here to read more ; Handri-Neeva | ఒకే కుటుంబంలో ఇద్దరు…

click here to read more ;

Leave a Reply