జగన్‌కి పగుందని అమరావతి అభివృద్ధి ఆగదు

జగన్‌కి పగుందని అమరావతి అభివృద్ధి ఆగదు

ఎన్టీఆర్ జిల్లా టీడీపీ కార్యదర్శి పిళ్ళా శ్రీనివారావు

భవానిపురం, ఆంధ్రప్రభ : కంసుడికి పగ ఉందని కృష్ణుడు జన్మ ఆగలేదని,జగన్ కి పగుందని అమరావతి అభివృద్ధి ఆగదని ఎన్టీఆర్ జిల్లా టిడిపి కార్యదర్శి పిళ్ళా శ్రీనివారావు గురువారం మీడియా ఓ ప్రకటన ద్వారా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాధారణంగా రాజధాని పరిసర ప్రాంతాలను కూడా కలుపుకుంటేనే, ఆ ప్రాంతానికి అమరావతితో అనుబంధం ఏర్పడుతుందని అన్నారు. ఎయిమ్స్, కినాగార్జున యూనివర్సిటీలో ఉన్న ఆఫీసులకు, అక్కడున్న ప్రముఖ ఆఫీసులకు అమరావతి పేరు అనుసంధానం చేయాలని అన్నారు.

గతంలో విట్, ఎస్ ఆర్ ఎమ్, అమృత యూనివర్సిటీలు అప్పట్లో చంద్రబాబు మీద ఉన్న నమ్మకముతో తమిళనాడు నుండి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి వచ్చాయని గుర్తు చేశారు. విట్ అమరావతి, ఎస్ ఆర్ ఎమ్ అమరావతిగా ఉండే పేర్లను మావిగన్రెడ్డి అనేవాడు అధికారంలోకి వచ్చాక అమరావతి అనే పదం బలవంతంగా తొలగించి ఏపీ అని మార్పు చేయించాడని విమర్శించారు.

ఎందుకు అమరావతి మీద అంత పగ అంటే! శ్రీ కృష్ణుడి జన్మమీద కంసుడికి దేనికి పగ అంటే ఏంచెబుతాం! ఇది అంతేనని ఎద్దేవా చేశారు.వాడికి పగ ఉందని కృష్ణుడు జన్మించకుండా వున్నాడా? కంసుడిని తుద ముట్టించకుండా వున్నాడా అని ప్రశ్నించారు. మనం వస్తూ వుంటాం !పోతూ ఉంటాం! తరాలు మారుతూ ఉంటాయి! మన రాష్ట్రానికి పాలకులుగా ఎవరు వచ్చినా, అమరావతి మాత్రం ఇక ఎప్పటికి అజరామరమే అని ఉద్ఘాటించారు.

Leave a Reply