nominations | అభ్యర్థులు.. క్యూ కట్టారు!

nominations | అభ్యర్థులు.. క్యూ కట్టారు!
- చివరి రోజు.. నామినేషన్ల జోరు
nominations | జనగామ, ఆంధ్రప్రభ ప్రతినిధి : జనగామ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల కేంద్రాల వద్ద సందడి నెలకొంది. నామినేషన్ వేసేందుకు అభ్యర్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జనగామ మున్సిపల్లోని 30 వార్డులకు నామినేషన్లు వేసేందుకు అధికార, ప్రతిపక్ష, ఇండిపెండెంట్ అభ్యర్థులు పెద్ద ఎత్తున వచ్చి నామినేషన్ వేసేందుకు క్యూ కట్టారు. దీంతో పోలీసు అధికారులు హెల్ప్ డెస్క్ నామినేషన్ల స్వీకరణకు కావలసిన ధ్రువపత్రాలను సరిచూసుకోవాలని సూచనలు చేశారు. అధికార, ప్రతిపక్షాలకు దీటుగా స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈసారి జనగామ జిల్లాలోని నూతనంగా ఏర్పడిన స్టేషన్ ఘన్పూర్ చైర్మన్ స్థానం, జనగామ చైర్మన్ స్థానం బీసీ జనరల్ రిజర్వుడ్ అయ్యింది.
