Nomination | నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు

Nomination | నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు

  • చెక్‌పోస్టుల వద్ద అప్రమత్తంగా ఉండాలి
  • జిల్లా ఎస్పీ మహేశ్ బి.గితే

Nomination | వేములవాడ, ఆంధ్రప్రభ : సర్పంచ్ ఎన్నికల మొదటి విడత నామినేషన్ ప్రక్రియ సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే(SP Mahesh B. Githe) తెలిపారు. మొదటి విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైందని, ఈ నేప‌థ్యంలో కేంద్రాల వ‌ద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత ఏర్పాట్లు చేసిన‌ట్లు చెప్పారు.

ఈ రోజు వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టెముల, సుకలమర్రి గ్రామలలో ఏర్పాటు చేసిన నామినేషన్ ప్రక్రియ(Nomination Process)ను రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐ వెంకటరాజంలతో కలసి ఎస్పీ పరిశీలించారు. నామినేషన్ కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధి వ‌ర‌కు 163 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని పాటించాల‌న్నారు.

చెక్ పోస్టుల వద్ద అప్రమత్తంగా ఉండాలని, క్షుణ్ణంగా వాహనాలను తనిఖీ చేయాలని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే సూచించారు. ఈ సందర్భంగా వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్(Police Station) పరిధిలోని ఫజుల్ నగర్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టును ఆకస్మిక తనిఖీ చేశారు. అనంత‌రం వాహన తనిఖీలు చేసి.. అక్క‌డి రిజిస్టర్‌ను పరిశీలించారు.

తనిఖీల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాల‌న్నారు. నగదు, మద్యం అక్రమ రవాణాను అరికట్టాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే వారిపై ఎన్నికల నియమావళి ప్రకారం చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చ‌రించారు. ఎస్పీ వెంట సీఐ శ్రీనివాస్, ఎస్ఐ వెంకట్రాజం, చెక్ పోస్ట్ సిబ్బంది ఉన్నారు.

Leave a Reply