సీపీ రాధాకృష్ణన్ నామినేష‌న్ దాఖ‌లు

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : ఎన్డీఏ కూటమి (NDA alliance) ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ నామినేషన్ (CP Radhakrishnan nomination)దాఖలు చేశారు. నాలుగు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, అమిత్ షా, గడ్కరీ (PM Modi, Rajnath Singh, JP Nadda, Amit Shah, Gadkari) హాజరయ్యారు. నామినేషన్‌కు ముందు రాధాకృష్ణన్ పార్లమెంట్ ఆవరణలో ప్రముఖ వ్యక్తుల విగ్రహాలను సందర్శించి నివాళులర్పించారు. ముందుగా మహాత్మాగాంధీ భారీ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఇతర విగ్రహాలకు నమస్కరించారు. రాధాకృష్ణన్ తమిళనాడు (Tamil Nadu) ప్రాంత వాసి. కోయంబత్తూరు (Coimbatore) నుంచి రెండు సార్లు లోక్‌సభ ఎంపీగా గెలిచారు. పుదుచ్చేరిలో లెఫ్టినెంట్ గవర్నర్‌గా.. జార్ఖండ్, తెలంగాణలో గవర్నర్‌గా పని చేశారు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. అలాగే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. అనూహ్యంగా రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి ఎంపిక చేసింది. ఎన్నికల్లో విజయం సాధిస్తే.. పూర్తి కాలంగా ఉపరాష్ట్రపతిగా కొనసాగుతారు.

ఇండియా కూట‌మి అభ్య‌ర్థిగా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి
ఇక ఇండియా కూటమి అభ్యర్థిగా ( India alliance candidate) తెలంగాణ వ్యక్తి, సుప్రీకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్‌‌రెడ్డి (former Supreme Court judge Sudarshan Reddy) పేరును కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రకటించారు. గురువారం సుదర్శన్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. జగదీప్ ధన్‌ఖర్ అనూహ్యంగా జూలై 21న ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో రాజీనామా చేసినట్లు ప్రకటించారు. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నికలు అనివార్యమయ్యాయి..

Leave a Reply