Nomination | గెలిపిస్తే.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి

Nomination | గెలిపిస్తే.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి

Nomination | ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి మండల పరిధిలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ(nomination process) రెండవ రోజు ఉత్సాహంగా ప్రారంభమైంది. ఈ రోజు ఎడపల్లి  గ్రామాని(Edapally Village)కి చెందిన శంకర్ నాయుడు(Shankar Naidu) సర్పంచ్ అభ్యర్థిగా తన నామినేషన్‌ను పంచాయతీ కార్యాలయంలో దాఖలు చేశారు.

అనంతరం ఆయ‌న మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధే తన లక్ష్యమని, ప్రజలు ఇచ్చే విశ్వాసం, మద్దతుతో ప్ర‌జ‌ల‌ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. గ్రామ ప్రజలతో కలిసి గ్రామ అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు.

Leave a Reply