Nomination | బీదరేల్లి గ్రామపంచాయతీ ఏకగ్రీవం

Nomination | బీదరేల్లి గ్రామపంచాయతీ ఏకగ్రీవం

Nomination | బాసర (నిర్మల్ జిల్లా) ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని 10 గ్రామపంచాయతీలకు గాను బిదరెల్లి గ్రామపంచాయతీ ఏకగ్రీవంగా సర్పంచును ఎన్నుకున్నట్లు ఎంపీడీవో దేవేందర్ రెడ్డి ఈ రోజు తెలిపారు. బీదరెల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిత్వానికి ముగ్గురు నామినేషన్(Nomination | ) వేయగా ఇద్దరు ఉపసంహరించుకోవడంతో విశ్వనాథ్ పాటెల్ ఏకాగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు.

మూడు గ్రామపంచాయతీలలో వార్డు మెంబర్ల ఏకగ్రీవం మండలంలోని ఓని, కౌట, సవర్గావ్ గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్లు ఏకాగ్రీవమైనట్లు ఎంపీడీవో దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఓని పంచాయితీ 8 వార్డులకు నలుగురు వార్డు సభ్యులు, కౌట గ్రామపంచాయతీలో 8 వార్డు సభ్యులకు గాను ఐదుగురు వార్డు సభ్యులు, సావర్గావ్ గ్రామపంచాయతీలో ఎనిమిది మంది వార్డు సభ్యులకు గాను ఏడుగురు వార్డు సభ్యులు ఏకగ్రీవం కాగా ఒకరు పోటీలో ఉన్నట్లు ఎంపీడీవో దేవేందర్ రెడ్డి(MPDO Devender Reddy) తెలిపారు.

Leave a Reply