Nomination | ఉద్యోగానికి రాజీనామా చేసి..

Nomination | ఉద్యోగానికి రాజీనామా చేసి..


సర్పంచ్ నామినేషన్ వేసి..!


రాంపూర్ సర్పంచ్ అభ్యర్థిగా కారంగుల గోపాల్ రెడ్డి
Nomination |
అల్లాదుర్గం, ఆంధ్రప్రభ : ఆయన ఐకేపీ వీఓఏ.. ఆర్థికంగా ఎలాంటి లోటు లేదు.. కానీ గ్రామాభివృద్ధి కోసం తన ఉద్యోగాన్ని సైతం వదులుకున్నాడు అల్లాదుర్గం మండలం రాంపూర్ గ్రామానికి చెందిన కారంగుల గోపాల్ రెడ్డి.. గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసి బరిలో నిలిచారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన ఆయన, గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు.

గ్రామాభివృద్దే లక్ష్యంగా..
ప్రజా సమస్యలపై అవగాహన కలిగిన యువ నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. ఐకేపీ వీఓఏగా విధుల్లో ఉన్న సమయంలో గ్రామ ప్రజల కోసం ప్రత్యేక చొరవ చూపారు. గ్రామస్థుల అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలు ఎంతో మందికి బాసటగా నిలిచాయి. అదే స్పూర్తితో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్నారు.

అవకాశం కల్పిస్తే అభివృద్ధి చేస్తా…
అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే సర్పంచ్ గా నామినేషన్ వేసినట్లు చెప్పారు. ఒక్కసారి అవకాశమిచ్చి ఆశీర్వదిస్తే… గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. నిత్యం మీలో ఒకడిగా ఉంటూ.. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపుతామని కారంగుల గోపాల్ రెడ్డి ఆంధ్రప్రభతో చెప్పారు.

Leave a Reply