ఆయకట్లూ లేదు

ఆయకట్లూ లేదు

  • జనవాస ప్రాంతం
  • బ్రహ్మగుండం చెరువును పరిశీలించండి
  • శ్రీకాకుళం పరిధిలో.. 16 ప్రాంతాల ప్రజలకు పొజిషన్ ఇవ్వండి
  • సిక్స్‌ స్టెప్స్‌ వేలిడేషన్‌ సవరించాలి
  • శ్రీకాకుళం అసెంబ్లీలో ఎమ్మెల్యే గొండు శంకర్ వినతి

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : శ్రీకాకుళం(Srikakulam) నగర పరిధిలో చౌదరి సత్యనారాయణ(Chowdhury Satyanarayana) కాలనీ, నీలమ్మ కాలనీ, బర్మాకాలనీ, బాయమ్మతోట, పెద్దరెల్లివీధి, పీఎన్‌ కాలనీ, నారాయణతిరుమల ప్రాంతం, దమ్మలవీధి, మంగువారితోట, సీపన్నాయుడుపేట, భైరివానిపేట(Bhairivanipet) వంటి 15 ప్రాంతాల్లో తరాలు తరబడి నివసిస్తున్నారని, ఇక్కడ ఇళ్లకు హౌస్‌ టాక్స్‌, వాటర్‌ టాక్స్‌, కరెంటు బిల్లులు కూడా చెల్లిస్తున్నా, ఇప్పటి వరకు పొజిషన్‌ సర్టిఫికెట్‌(Position Certificate) ఇవ్వనందున ఇంటిపై రుణం తీసుకోవడం కుదరడంలేదని, వీటిని ఇప్పించడం వల్ల ప్రభుత్వానికి అదనంగా ఆర్ధిక భారం ఉండదు కాబట్టి రెవెన్యూమంత్రి పొజిషన్‌ సర్టిఫికెట్లు ఇచ్చేలా ఆదేశించాలని డిప్యూటీ స్పీకర్‌ రఘు రామకృష్ణంరాజును(Raghu Ramakrishnam Raju) శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌(Gondu Shankar) కోరారు. అసెంబ్లీ చివరి రోజు శనివారం శంకర్‌ నియోజకవర్గంలో దీర్ఘకాలంగా మిగిలిపోయిన సమస్యలపై రఘురామకృష్ణంరాజు ద్వారా రెవెన్యూమంత్రికి విన్నవించారు.

ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలు అందుకోడానికి అర్హులను గుర్తించడంలో సిక్స్‌ స్టెప్స్‌(Six Steps) వాలిడేషన్‌ను అనుసరిస్తున్నామని, దీనివల్ల అర్హులు కూడా నష్టపోతున్నారని, గత ప్రభుత్వం సంక్షేమ పథకాల అర్హులను తగ్గించడం కోసం హౌస్‌ హోల్డ్‌ మ్యాపింగ్‌ను సిక్స్‌ స్టెప్స్‌ పద్ధతిలో చేసిందని, దాన్నిసవరిస్తే ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందన్నారు.

గార మండలం అంపోలులో ఒక మండల కేంద్రంలో ఉండాల్సిన సౌకర్యాలన్నీఉన్నాయని, గతంలో ఒక రైతు భరోసా కేంద్రాన్నినిర్మిస్తున్నప్పుడు ప్రైవేటు వ్యక్తి కోర్టుకు వెళ్లారని, దీనికి కౌంటర్‌ వేసిన ప్రభుత్వం అది చెరువుగా నివేదించడం వల్ల అక్కడ నిర్మాణాలన్నీతొలగించాలని కోర్టు ఆదేశించిందని, దీనిపై ప్రభుత్వం మరోసారి దృష్టి సారించాలని గొండు శంకర్‌ కోరారు.

వాస్తవానికి సర్వే నెంబరు 534/1లో(Survey No. 534/1) 16 ఎకరాల్లో ఉన్న బ్రహ్మగుండం చెరువు కింద ఆయకట్టు లేదని, స్వాతంత్య్రానికి పూర్వమే ఇక్కడ చెరువు లేదని, అందుకే ఇక్కడ ఆర్‌ అండ్‌ బి రోడ్డు, పాఠశాల, హెల్త్‌ సెంటరు, కల్చరల్‌(Cultural) వేదిక వంటి అనేక ప్రభుత్వ ఆస్తులున్నాయని, దీనికి ఆనించి 300 మంది ఇళ్లు కూడా నిర్మించుకున్నారని, ఇప్పుడు కోర్టు కూల్చేయమనడంతో వీరంతా రోడ్డున పడతారని గొండు శంకర్‌ స్పీకర్‌కు వివరించారు.

ఇదే అంశం మీద గతంలో రెవెన్యూమంత్రి విశాఖపట్నం(Visakhapatnam) వచ్చినప్పుడు వినతిపత్రం సమర్పించామని, ఇప్పుడు స్పీకర్‌ ద్వారా సమస్యను విన్నవిస్తున్నామని, దీనికి సత్వర పరిష్కారం కోరుతున్నట్లు ఆయన సభలో ప్రస్తావించారు.

Leave a Reply