నిజామాబాద్ ప్రతినిధి ఏప్రిల్7: (ఆంధ్రప్రభ)డంపింగ్ యార్డ్ కు వెళ్ళ కుండా చెత్త సేకరణ వాహ నాలను తమ వాహనాలను అడ్డంగా పెట్టి కాలనీ వాసులు అడ్డుకున్న ఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసు కుంది. సోమవారం తెల్ల వారు జామున ఎప్పటి లాగే నగరంలో చెత్త సేకరించిన చెత్త వాహనాలు డంపింగ్ యార్డ్ కు సోమవారం ఉదయం తీసుకెళ్తున్న క్రమంలో రోడ్డుకు అడ్డంగా కాలనీవాసుల వాహనాలను పెట్టి చేత్త సేక రణ వాహనాలు వెళ్లకుండా అడ్డుకున్నారు.

డంపింగ్ యార్డ్ లో వరుస అగ్ని ప్రమాదాలతో తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొం టున్నా మని… ఆ పొగతో ఉక్కి రిబిక్కిరి అవుతున్నామని డంపింగ్ యార్డ్ కు అనుకొని ఉన్న స్థానిక ప్రజలు ఆందోళన బాట పట్టారు. కాలనీ వాసుల ఆందోళనలతో నాగారం నుండి గోశాల వరకు చెత్త సేకరణ వాహనాలు పూర్తి గా నిలిచిపోయాయి. డంపింగ్ యార్డ్ సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు.