Nirmal District | మానవత్వం చాటుకున్న మాజీ మంత్రి అల్లోల

Nirmal District | మానవత్వం చాటుకున్న మాజీ మంత్రి అల్లోల
Nirmal District | నిర్మల్ టౌన్, ఆంధ్రప్రభ : తనలోని మానవత్వాన్ని మాజీమంత్రి అల్లోల చాటుకున్నారు. ఆదివారం ఉదయం నిర్మల్ జిల్లా శివాజీ చౌక్ దగ్గర జరిగిన ప్రమాదంలో ఆయన తక్షణమే స్పందించి, ప్రయాణికుల ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించారు. ఆయన నిర్మల్ (nirmal) నుండి బైంసాకు వెళ్తున్నారు. సరిగ్గా అదే సమయంలో మంచిర్యాల చౌరస్తా శివాజీ చౌక్ వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదం ధాటికి ఒక ఆటో రోడ్డు పై బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో అటుగా వెళ్తున్న అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన వాహనాన్ని ఆపారు. వెంటనే ఆటోలో చిక్కుకున్న ప్రయాణికులను ఆయన బయటకు తీశారు. ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి తీవ్ర గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. భయాందోళనకు గురైన ఆటో డ్రైవర్లను, ప్రయాణికులను ఆయన దగ్గరకు తీసుకుని ఓదార్చి, వారికి ధైర్యం చెప్పారు.
