ఖానాపూర్ మున్సిపాలిటీని బీజేపీ కైవసంతో

ఖానాపూర్ మున్సిపాలిటీని బీజేపీ కైవసంతో
ఉట్నూర్ లో బీజేపీ నాయకుల సంబరాలు
ఉట్నూర్, ఆంధ్రప్రభ : బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు రాథోడ్ రితీష్ నాయకత్వంలో శనివారం జరిగిన ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలో బీజేపీ పార్టీ చెందిన చైర్మన్ గా అంకం మౌనిక మహేందర్, ఎన్నికైన సందర్భంగా ఉట్నూర్ లోని స్థానిక ఐబీ చౌరస్తాలో శనివారం మధ్యాహ్నం ఉట్నూర్ ఐబి చౌరస్తాలో బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. నాయకులు టపాకాయలు పేల్చి, మిఠాయిలు పంచుతూ విజయోత్సవ సంబరాలు జరుపుకోన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి కొండేరి రమేష్, లీగల్ సెల్ అడ్వైసర్ బానోత్ జగన్ నాయక్, బీజేపీ ఎస్ టి ఎం జి ఎస్ రాథోడ్ శేషారావు, మండల ప్రధాన కార్యదర్శి కాల్వ రవి, మాజీ ఎంపిటిసి సల్గర్ రవీందర్, బీజేపీ సోషల్ మీడియా నిర్మల్ జిల్లా కో-కన్వీనర్ పొన్నం జగన్ పటేల్, జిల్లా నాయకులు సాడిగే రాజేశ్వర్, సీపతి లింగా గౌడ్, ఉస్కేమొల్ల దేవిదాస్, మండల నాయకులు తన్నీరు సతీష్, పోతు రవీందర్, తోట సత్యన్న, ఉగ్గే విజయ్, జితేందర్, రాములు, వర్మ, బీజేవైఎంమండల అధ్యక్షులు సాన గోపి, కార్యకర్తలు పాల్గొన్నారు.
