Nikhat Zareen | లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా !
- ప్రపంచ బాక్సింగ్ కప్‌లో భారత్‌కు 9 స్వర్ణాలు
ఆంధ్రప్రభ : గ్రేటర్ నోయిడా వేదికగా జరిగిన ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో భారత బాక్సర్లు అదరగొట్టారు. మొత్తం 9 స్వర్ణాలు, 6 రజతాలు, 5 కాంస్యాలు దక్కించుకుని భారత్ కొత్త చరిత్రను సృష్టించింది. మహిళల విభాగంలో భారత బాక్సర్లు 7 గోల్డులతో క్లీన్ స్వీప్ చేయగా.. పురుషుల విభాగంలో 2 గోల్డులు జతచేసి మెరిశారు.
Nikhat Zareen మరోసారి వరల్డ్ కప్ గోల్డ్!
తెలంగాణ ముద్దుబిడ్డ, స్టార్ మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ తన అద్భుత పంచ్‌లతో మరోసారి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. 20 నెలల తర్వాత అంతర్జాతీయ రంగంలో పతకం సాధించిన నిఖత్, ఈ టోర్నీలో తిరిగి బరిలోకి దిగింది. గాయం కారణంగా ఏడాది రోజుల పాటు ఆటకు దూరమైన నిఖత్… రీఎంట్రీ వచ్చిన వెంటనే మూడో వరల్డ్ కప్ గోల్డ్ మెడల్ను కొల్లగొట్టింది.
51 కేజీల మహిళల విభాగం ఫైనల్లో, నిఖత్ 5-0 తేడాతో చైనీస్ తైపీ బాక్సర్ జువాన్ యి గువోపై ఒకపక్కా విజయం సాధించింది. రెండుసార్ల ప్రపంచ ఛాంపియన్‌గా తలపెట్టిన తాను మరోసారి భారత గర్వకారణమైంది.


మహిళల విభాగంలో 7 స్వర్ణాలు..
నిఖత్‌తో పాటు ఇతర భారత మహిళా బాక్సర్లు కూడా అద్భుత ప్రదర్శన చేశారు.
మినాక్షి హూడా (48 కేజీలు), ప్రీతి పవార్ (54 కేజీలు), జాస్మిన్ లంబోరియా (57 కేజీలు), పర్వీన్ హూడా (65 కేజీలు), అరుంధతి చౌదరి (70 కేజీలు), నూపుర్ షెరాన్ (80+ కేజీలు) స్వర్ణాలు గెలుచుకున్నారు. మహిళల విభాగంలో పూజారాణి (80 కేజీలు) రజత పతకం సాధించింది.
పురుషుల విభాగంలో 2 గోల్డులు..
భారత పురుష బాక్సర్లు కూడా దుమ్ము దులిపారు. సచిన్ (60 కేజీలు), హితేష్ (70 కేజీలు) స్వర్ణ పతకాలు సాధించారు.
జాదుమణి (50 కేజీలు), పవణ్ బర్త్‌వాల్ (55 కేజీలు), అభినాష్ జమ్‌వాల్ (65 కేజీలు), అంకుశ్ పంగల్ (80 కేజీలు), నరేందర్ (90+ కేజీలు) పురుషుల విభాగంలో సిల్వర్ మెడల్స్ గెలుచుకున్నారు.

