Nidhi agarwal | అలా చేస్తుందా..?

Nidhi agarwal | అలా చేస్తుందా..?

Nidhi agarwal | లక్కీ ఛాన్స్‌తో వచ్చిన బ్రేక్
సినిమాల ఫలితాలు ఇచ్చిన షాక్
బ్రాండ్ ప్రమోషన్స్‌లో నిధి యాక్టివ్
సినిమా అవకాశాలపై సందేహాలు

Nidhi agarwal | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : అందాల నిధి అగర్వాల్.. భారీ ఆఫర్స్ వస్తాయని.. తన కెరీర్ మరో టర్న్ తీసుకుంటుందని ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే.. ఆ ఆశలు ఏవీ కూడా పలించలేదు. దీంతో అవకాశాలు కోసం చాలా అంటే చాలా ట్రై చేస్తుంది కానీ.. ఏదీ వర్కవుట్ కావడం లేదట. రాజాసాబ్ తర్వాత వరుసగా కొత్త సినిమాల్లో ఛాన్సులు వస్తాయి.. కొత్త సినిమాలు ప్రకటించాలి అనుకుంది కానీ.. అలా జరగలేదు. అందుకే.. సినిమాల నుంచి ఫోకస్ మార్చిందని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ.. అందాల నిధి ఏం చేస్తుంది..?

Nidhi agarwal | లక్కీ ఛాన్స్..

Nidhi agarwal

సవ్యసాచి సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు ఆతర్వాత మిస్టర్ మజ్ను సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలు నిధికి ఆశించిన విజయాన్ని ఇవ్వలేదు. ఇలాంటి టైమ్ లో పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ మూవీలో ఛాన్స్ ఇచ్చారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో.. నిధి పై అందరి దృష్టి పడింది. హీరో సినిమాలో నటించింది. ఈ మూవీ ఆకట్టుకోలేదు. ఆతర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరి హర వీరమల్లు సినిమాలో నటించే లక్కీ ఛాన్స్ సొంతం చేసుకుంది. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు జంటగా రాజాసాబ్ మూవీలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఈ రెండు సినిమాలు దశ మార్చేస్తాయి అనుకుంటే.. రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి.

Nidhi agarwal | నిధి కండోమ్.. ప్రమోషన్..

Nidhi agarwal

దీంతో ఆఫర్స్ రావడం లేదు. అయితే.. సినిమా ఛాన్సుల కోసం ఎదురు చూడకుండా యాడ్స్, బ్రాండ్ ప్రమోషన్స్‌ పై ఎక్కువగా దృష్టి పెట్టుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల ఆమె పలు కమర్షియల్ ప్రకటనలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, సోషల్ మీడియా ప్రమోషన్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. దీంతో ఆమె సినిమా అవకాశాలు తగ్గాయా అనే చర్చ సినీ వర్గాల్లో సాగుతోంది. అయితే.. కండోమ్ బ్రాండ్ ను సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తుండడం విశేషం. ఈ యాడ్ చూసిన నెటిజన్లు.. అవకాశాలు లేక అమ్మడికి ఎంత కష్టం వచ్చింది. ఆఖరికి కండోమ్ యాడ్స్ చేసుకుంటుందా..? అని కామెంట్స్ చేస్తున్నారు.

Nidhi agarwal | రూటు మార్చిన నిధి..

Nidhi agarwal

ఇటీవల సెలబ్రిటీలు సినిమాలే కాకుండా బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ద్వారా కూడా ఆదాయం మరియు గుర్తింపు పొందడం సాధారణంగా మారింది. నిథి అగర్వాల్ కూడా ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతూ, ఫ్యాషన్, బ్యూటీ, లైఫ్‌స్టైల్ బ్రాండ్లకు అంబాసిడర్‌గా పని చేస్తోంది. సోషల్ మీడియాలో ఆమెకు ఉన్న ఫాలోయింగ్ కారణంగా కంపెనీలు కూడా ఆమెను తమ బ్రాండ్ ప్రమోషన్స్ కోసం ఎంపిక చేస్తున్నాయి. సినిమా అవకాశాలు తగ్గాయని అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోయినా, రూటు మార్చి ప్రస్తుతం యాడ్స్ బ్రాండ్ ప్రమోషన్స్‌లో యాక్టివ్‌గా ఉంది. మరి.. ఈ అమ్మడు ఆశించిన సినిమా ఆఫర్స్ త్వరలో వస్తాయోమో చూడాలి.

Nidhi agarwal

Leave a Reply