new year 2026 | అక్కినేని హీరోల ఆశలన్నీ..

new year 2026 | అక్కినేని హీరోల ఆశలన్నీ..
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : అక్కినేని హీరోలు.. నాగార్జున, నాగచైతన్య, అఖిల్… ఈ ముగ్గురు హీరోల సినిమాలు ఎప్పుడెప్పుడు వస్తాయా..? ఎప్పుడెప్పుడు థియేటర్స్ లో చూద్దామా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఈ అక్కినేని అందగాళ్లు.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించాలని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే.. అభిమానులే కాదు.. అక్కినేని హీరోలు కూడా బాగా ఆశలు పెట్టుకున్నారట. ఇంతకీ.. దేనిపై ఆశలు పెట్టుకున్నారు.. తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే.. ఇది చదవాల్సిందే..
new year 2026 | అక్కినేని హీరోలు 2025..

2025లో నాగార్జున కుబేర, కూలీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే.. ఈ రెండు సినిమాల్లో నాగార్జున హీరోగా కాకుండా అంతకు మించిన కీలక పాత్రలు చేశారు. కుబేర సినిమాలో కీలక పాత్ర పోషించారు కానీ.. కూలీ సినిమాలో అయితే.. నాగార్జున విలన్ గా నటించారు. దాదాపు నలభై ఏళ్ల కెరీర్ లో ఫస్ట్ టైమ్ నాగార్జున విలన్ గా నటించడంతో కూలీ సినిమా పై మరింత క్రేజ్ ఏర్పడింది కానీ.. ఈ మూవీ షాక్ ఇచ్చింది. కోలీవుడ్ లో కూలీ ఫస్ట్ 1000 కోట్ల మూవీగా నిలుస్తుంది అనుకుంటే.. ప్లాప్ అయ్యింది. అయితే.. నాగార్జున నటించిన విలన్ పాత్రకు మాత్రం కోలీవుడ్ లో మాంచి రెస్పాన్స్ వచ్చింది. తమిళనాడు యూత్.. కూలీలో నాగార్జున పాత్రను బాగా ఎంజాయ్ చేయడం.. రీల్స్ చేయడం.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
new year 2026 | తండేల్ 100 కోట్లు..

నాగచైతన్య థ్యాంక్యూ, లాల్ సింగ్ చడ్డా, కస్టడీ చిత్రాలతో వరుసగా ఫ్లాప్స్ చూసి.. సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న టైమ్ లో తండేల్ సినిమా వచ్చింది. చందూ మొండేటి డైరెక్షన్ లో.. గీతా ఆర్ట్స్ నిర్మించిన తండేల్ సినిమా 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. చైతన్య కెరీర్ లో.. 100 కోట్లుకు పైగా కలెక్ట్ చేసిన ఫస్ట్ మూవీగా తండేల్ నిలిచింది. అయితే.. నాగార్జున, నాగచైతన్య నుంచి సినిమాలు వచ్చాయి కానీ.. అఖిల్ నుంచి మాత్రం ఒక్క సినిమా కూడా రాలేదు. ఏజెంట్ మూవీ 2023లో రిలీజైంది. అంటే.. రెండు సంవత్సరాలు అయినా అఖిల్ నుంచి కొత్త సినిమా రిలీజ్ కాలేదు.
new year 2026 | నాగ్ 100వ సినిమా..

అక్కినేని నాగార్జున కెరీర్ లో మైలురాయిగా నిలిచే 100వ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవల సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమా సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో సీనియర్ నటీమణులు టబు, అనుష్క నటిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే.. అఫిషియల్ గా ఎలాంటి అప్ డేట్ మాత్రం ఇవ్వలేదు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది.. నెక్ట్స్ ఇయర్ ఈ సినిమాని రిలీజ్ చేస్తామని నాగార్జున ఇటీవల ప్రకటించారు. అక్కినేని అభిమానులు ఎప్పటి నుంచో ఈ క్రేజీ మూవీ గురించి ఆతృతగా ఎదురు చూస్తుండడంతో భారీగా ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.
new year 2026 | చైతూ వృషకర్మ..

నాగచైతన్య తండేల్ సినిమాతో ఫుల్ ఫామ్ లోకి రావడంతో.. ఇప్పుడు వృషకర్మ అనే డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాని విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండు తెరకెక్కిస్తున్నారు. అయితే.. తండేల్ మూవీతో 100 క్లబ్ లో చేరిన చైతూ.. ఇప్పుడు నెక్ట్స్ సినిమాని 100 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండడం విశేషం. ఇటీవల ఈ సినిమా టైటిల్ వృషకర్మ అని ప్రకటించారు. పురాణాల్ని, చరిత్రను కలిపి రెడీ చేసిన ఈ కథ పై చైతూ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇటీవల చైతూ పుట్టినరోజు సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు. సీనియర్ ప్రొడ్యూసర్ బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రెగ్యులర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా రూపొందుతోన్న ఈ సినిమాని 2026 సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు.
new year 2026 | భారీ అంచనాలతో లెనిన్..

అఖిల్ ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ సాధిస్తాడు అనుకుంటే.. ఇంత వరకు బ్లాక్ బస్టర్ రాలేదనే చెప్పాలి. తొలి విజయం సాధించడం కోసం నాలుగవ సినిమా వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. అఖిల్ అనే సినిమా నిరాశపరిచింది. ఆతర్వాత నటించిన హలో, మిస్టర్ మజ్ను సినిమాలు యావరేజ్ కాగా.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీ మాత్రం హిట్ అయ్యింది. ఆతర్వాత ఏజెంట్ మూవీతో బ్లాక్ బస్టర్ సాధిస్తాడు అనుకుంటే.. డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో లెనిన్ అనే సినిమా చేస్తున్నాడు.
డివోషనల్ టచ్ ఉన్న ఈ విలేజ్ స్టోరీ గ్లింప్స్ కు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. మురళీ కిషోర్ అబ్బూరు ఈ సినిమాని తెరకెక్కిస్తుంటే.. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్స్ పై నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సమ్మర్ లో లెనిన్ రిలీజ్ కి రెడీ అవుతుంది. సో.. అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్య, అఖిల్.. 2026 పైనే ఆశలు పెట్టుకున్నారు. మరి.. 2026 అక్కినేని హీరోలకు మరచిపోలేని ఇయర్ గా నిలుస్తుందేమో చూడాలి.
