దివ్యాంగ శక్తి పథకం.. దివ్యాంగులకు ఆసరా

దివ్యాంగ శక్తి పథకం.. దివ్యాంగులకు ఆసరా

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : దివ్యాంగుల ఉచిత ప్రయాణానికి ఉద్దేశించిన “దివ్యాంగ శక్తి పథకం”ను బుధవారం కర్నూలు బస్ స్టేషన్‌లో జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం దివ్యాంగులకు ఎంతో ప్రయోజనం చేకూర్చనుందని, పథకం ముఖ్య లక్షణాలను వివరించారు.


కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, దివ్యాంగుల కోసం ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కర్నూలు టిడిపి అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ మాట్లాడుతూ, ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ఈ పథకాన్ని అందరూ వినియోగించుకోవాలని సూచించారు.


ఆర్టీసి ప్రజా రవాణా అధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ, గతంలో దివ్యాంగులు 50 శాతం చార్జీతో ప్రయాణించేవారని, ప్రస్తుతం 40 శాతం దివ్యాంగత్వం ఉన్నవారు పూర్తిగా ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించబడిందని తెలిపారు.విభిన్న ప్రతిభావంతుల సంఘం అధ్యక్షుడు ఎల్లప్ప మాట్లాడుతూ, దివ్యాంగులు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్నారని, ఈ పథకం వారికి మరింత సహకారం అందిస్తుందని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో కర్నూలు-1 డిపో మేనేజర్ సుధారాణి, ఏటీఎం (కమర్షియల్) దీప్తి సుజనతో పాటు కర్నూలు-1, కర్నూలు-2 డిపోల ఆర్టీసి సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply