ఎస్సై రవికుమార్ కు నూతన సర్పంచుల సన్మానం

జైనూర్, ఆంధ్రప్రభ ; కొమరం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ ఎస్సై రవికుమార్ కు శుక్రవారం పోలీస్ స్టేషన్లో మండలంలోని గ్రామ పంచాయతీల కొందరు నూతన సర్పంచులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్ఐ రవికుమార్ కు శాలువాలతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ రవికుమార్ నూతన సర్పంచులకు శుభాకాంక్షలు తెలుపుతూ పంచాయితీల్లో ఏ సమస్యలున్న తన దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు.
శాంతి భద్రతల పరిరక్షణకు సర్పంచులు సహకరించాలని ఎస్సై కోరారు. ఈ సన్మాన కార్యక్రమంలో జండగూడ సర్పంచ్ ఉయిక చందన్ షావ్, పవర్ గూడా సర్పంచ్ తొడసం రాజేందర్, మరల వై సర్పంచ్ కనక ప్రతిభ, పాన పటార్ సర్పంచ్ ఆత్రం తులసి శంకర్, మణిగూడ సర్పంచ్ జాదవ్ జనాభాయి గణపత్ నాయక్, రావుజిగూడ సర్పంచ్ జాదవ్ బా వురావ్, పంగిడి సర్పంచ్ ఆత్రం మీరా జాలింషా, బూసి మెట్ట సర్పంచ్ ఆత్ర0 సింధు నగేష్, తదితరులు పాల్గొన్నారు.
