ఆదిత్య బిల్డ‌ర్స్ ఆర్థిక సాయం

ఆదిత్య బిల్డ‌ర్స్ ఆర్థిక సాయం

మణికొండ, అక్టోబర్ 29 (ఆంధ్ర‌ప్ర‌భ) : మణికొండ మున్సిపాలిటీలోని లాంకో హిల్స్ హనుమాన్ టెంపుల్ (Lanco Hills Hanuman Temple) వద్ద అయ్యప్ప స్వాముల కోసం నూతన సన్నిధానం నిర్మించారు. ఆదిత్య బిల్డర్స్ కోటారెడ్డి ఆర్థిక సాయంతో అయ్యప్ప స్వాములకు సన్నిధానం కోసం నూతన భవనాన్ని నిర్మించారు.

ఈ భ‌వ‌నాన్ని ఈ రోజు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మణికొండ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి (Narendra Reddy) మాట్లాడుతూ.. స్వాములకు ఈ భవనాన్ని నిర్మించి ఇచ్చినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకు అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ రాజేందర్ గౌడ్ బి.రవి కాంత్ రెడ్డి. వి.అరవింద్, ఎస్ . వెంకట్రావు, కే. సురేందర్ రెడ్డి, ఎం .రాఘవరెడ్డి, బి. రామిరెడ్డి, కె.ప్ర‌భాకర్ రెడ్డి , కృష్ణ , కె.మధుసూదన్ రెడ్డి, భరత్ శ్రీశైలం, ఎం శ్రీనివాస్ రెడ్డి, కే.మహేందర్ రెడ్డి, ధరణి మహేష్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply