New Movie | అనౌన్స్ చేసిన బెల్లంకొండ..

New Movie | అనౌన్స్ చేసిన బెల్లంకొండ..
New Movie | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అల్లుడు శీను అంటూ కెరీర్ స్టార్ట్(Career start) చేసాడు. తొలి సినిమాతోనే ఆడియన్స్ ని మెప్పించి సక్సెస్ సాధించాడు. ఆతర్వాత జయ జానకి నాయక, సాక్ష్యం, కవచం, సీత, రాక్షసుడు.. ఇలా విభిన్న కథా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు(Unique identity) ఏర్పరుచుకున్నాడు. ఇటీవల ఛత్రపతి మూవీని హిందీలో రీమేక్ చేసాడు. అయితే.. ఆ సినిమా అంతగా ఆడలేదు. ఇటీవల భైరవం, కిస్కంధపురి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. అవి యావరేజ్ గానే నిలిచాయి కానీ.. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు.
New Movie | యంగ్ హీరో పుట్టినరోజు సందర్భంగా..

ఇప్పుడు ఈ యంగ్ హీరో పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాను అనౌన్స్(New movie announcement) చేశారు. ఈ మూవీ టైటిల్ రామమ్. బెల్లంకొండ ఈ చిత్రాన్ని దోనేపుడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం బ్యానర్ పై ప్రొడ్యూసర్స్ వేణు దోనేపూడి నిర్మిస్తున్నారు. లోకమాన్య దర్శకత్వం వహిస్తున్నారు. ది రైజ్ ఆఫ్ అకిరా ట్యాగ్ లైన్(The Rise of Akira tag line) తో తెరకెక్కుతున్న రామమ్ సినిమా నుంచి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ షాడో తో రిలీజ్ చేసిన ప్రీ లుక్ పవర్ ఫుల్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా గురించి మరిన్ని అప్ డేట్స్ త్వరలో మేకర్స్ వెల్లడించనున్నారు. మరి.. సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న బెల్లంకొండ ఈ మూవీతో ఆశించిన విజయం(Expected success with the movie) సాధిస్తారేమో చూడాలి.

