New Jersy Frozen :  వామ్మో .. మంచు  జెర్సీ  AndhraPrabha Real News

New Jersy Frozen :  వామ్మో .. మంచు జెర్సీ  AndhraPrabha Real News

న్యూయార్క్​.. న్యూజెర్సీల్లో .. మంచు తుపాన్​

జనజీవనం అతలాకుతలం

అనేక కౌంటీల్లో  ఎమర్జెన్సీ

2000 ఫ్లయిట్​ సర్వీసులు రద్దు

( ఆంధ్రప్రభ,  న్యూజెర్సీ)

New Jersy Frozen

 అమెరికాలోని  ఈశాన్య  ప్రాంతాలపై  మంచు తుపాను (Snow Cyclone)  విరుచుకుపడింది. మంచు కంబళి కౌగిట్లో   రోడ్లు,   భవనాలు బంధీగా మారాయి.  అనేక ఈశాన్య రాష్ట్రాలలో  రోజువారీ జన జీవనం  (Frozen) స్థంభించింది.  న్యూయార్క్ నగరంలో 4.3 అంగుళాల హిమపాతం నమోదైంది, 2022 తర్వాత ఈ ప్రాంతంలో ఇంత స్థాయిలో మంచు కురవటం ఇది అత్యధికం అని  ఆదివారం నేషనల్​ వెదర్ సర్వీస్ ( NWS )​  నివేదించింది.

New Jersy Frozen

New Jersy Frozen

న్యూయార్క్   పొరుగున  న్యూజెర్సీ (New Jersey) లో  అత్యవసర పరిస్థితిని ప్రకటించారు, ప్రమాదకర పరిస్థితుల నేపథ్యంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు అధికారులు హెచ్చరించారు.    అనవసర ప్రయాణాలు వద్దని సూచించారు.  న్యూయార్క్,   కనెక్టికట్‌లకు వింటర్​ సైక్లోన్  (Winter Cyclone) ​  హెచ్చరికలను జాతీయ వాతావరణ సేవ సంస్థ  జారీ చేసింది, భారీ హిమపాతంతో  అత్యధిక  ప్రాంతాల్లో  దృశ్య మానత ప్రభావితం  కొనసాగుతుందని హెచ్చరించింది.

New Jersy Frozen

New Jersy Frozen

విపరీతంగా మంచు కురుస్తుండటంతో   పేలవ దృశ్యమానత అనివార్యమైంది. కళ్లకు ఏమీ కనిపించని స్థితి ఏర్పడింది.   కార్లు, బస్సులు నిలిచిపోయాయి. ఇక  విమాన యానం పరిస్థితి వర్ణనాతీతం.   రవాణకు తీవ్రం అంతరాయం కలిగింది,  దేశవ్యాప్తంగా 2,000  పైగా (Flight Services)  విమాన సర్వీసులను (Cancelled)  రద్దు చేశారు. మంచు తుఫాను ప్రభావంతో  విమానయాన సంస్థలు నానా  కష్టాలు పడుతున్నారు. అనేక విమానాశ్రయాల్లో ప్రయాణికులు చిక్కుకుపోయారు, విమానం రాకపోకలకు  ఆలస్యం తప్పటం లేదు. ప్రయాణికులు  తీవ్ర అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు.

New Jersy Frozen

New Jersy Frozen

తీవ్రమైన ఈ వాతావరణంలో మంచును తొలగించడానికి,  ప్రజల భద్రతకు అత్యవసర సేవలు ప్రారంభించారు.   రోడ్డు రవాణ  సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఈ తుపానుకు ముందే న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ రాష్ట్రంలోని సగానికి పైగా కౌంటీలకు (Emergemcy)  అత్యవసర పరిస్థితిని  ప్రకటించారు.  శనివారం తెల్లవారుజామున, సెంట్రల్ న్యూయార్క్‌లోని సిరక్యూస్  నుండి   ఆగ్నేయంలోని లాంగ్ ఐలాండ్ వరకు దాదాపు 6-10 అంగుళాల మంచు కురిసింది. న్యూజెర్సీలో అధిక హిమపాతం నమోదైంది, అక్కడ అత్యవసర పరిస్థితిని కూడా ప్రకటించారు  

New Jersy Frozen  

New Jersy Frozen

నెక్టికట్‌లో, ఫెయిర్‌ ఫీల్డ్ కౌంటీలో 9.1 అంగుళాల మంచు కురిసింది. శనివారం ఉదయం నాటికి తుఫాను తీవ్రత తగ్గింది, కానీ ఉష్ణోగ్రతలు చలి కంటే తక్కువగా ఉన్నాయి   రోడ్లపై  పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయి. మంచు కరగడం వల్ల రోడ్లు  వంతెనలపై నల్లటి మంచు ఏర్పడే అవకాశం ఉందని NWS హెచ్చరించింది. నిరాశ్రయులను  చలి నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు (Code Blue)  “కోడ్  బ్లూ” ను యాక్టివేట్​ చేశారు.

ALSO READ : తైవాన్‌ను వణికించిన భారీ భూకంపం…

Leave a Reply