హైదరాబాద్: తెలంగాణ విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి కొత్త డైరెక్టర్ జనరల్‌గా విక్రమ్ సింగ్ మాన్ ఐపీఎస్ (1998 బ్యాచ్) నియమితులయ్యారు. ఈ నెల 31న పదవీ విరమణ పొందుతున్న కే.శ్రీనివాస రెడ్డి ఐపీఎస్ (1994 బ్యాచ్) స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ నగర అదనపు పోలీస్ కమిషనర్ (లా & ఆర్డర్)గా పనిచేస్తున్న విక్రమ్ సింగ్ మాన్, ఇకపై విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలకు డీజీగా నాయకత్వం వహించనున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
