నెమ‌లి వేణుగోపాలుడి పెళ్లి సంద‌డి Andhra Prabha News

నెమ‌లి వేణుగోపాలుడి పెళ్లి సంద‌డి Andhra Prabha News

బ్రహ్మోత్సవాలకు ఊరు ఊరంతా సిద్ధం .
.
ఎంపి కేశినేని శివనాథ్ కు ఆహ్వానం…

పూటి లాగుడు ప్ర‌ద‌ర్శ‌న క‌ర‌ప‌త్రం ఆవిష్క‌ర‌ణ‌

( ఆంధ్రప్రభ విజయవాడ)

తిరువూరు నియోజ‌క‌వ‌ర్గం గంపలగూడెం మండలం లో ప్రముఖ పుణ్యక్షేత్రం నెమలి వేణుగోపాల స్వామి వార్షిక‌ బ్రహ్మోత్సవాలకు విచ్చేయాలని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ ను నెమలి వేణుగోపాల స్వామి ఆల‌య అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ ఎన్.సంధ్య ఆహ్వానించారు.

ఆదివారం గురునాన‌క్ కాల‌నీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో ఎంపి కేశినేని శివనాథ్ ను కలిశారు.ఈ బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 5 వరకు వైభవంగా జ‌రుగుతాయ‌ని, శ్రీ స్వామి క‌ళ్యాణం మార్చి 2వ తేదీ రాత్రి 9 గంట‌ల‌కు జ‌రుగుతుంద‌ని తెలిపి ఆహ్వాన ప‌త్రిక అందించారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఈ బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా మార్చి 4వ తేదీ నుంచి మార్చి 5 తేదీ వ‌ర‌కు నిర్వ‌హించే పూటి లాగుడు ప్ర‌ద‌ర్శ‌న క‌ర‌ప‌త్రం ఆవిష్క‌రించారు.

నెమలి వేణుగోపాల స్వామి తీర్ధ ప్రసాదాలు, శేష వస్త్రం ఎంపీ కేశినేని శివ‌నాథ్ కు అందజేశారు. అనంత‌రం నెమలి వేణుగోపాల స్వామి వార్షిక‌ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు గురించి ఎంపీ కేశినేని శివ‌నాథ్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ఉప ప్ర‌ధాన అర్చ‌కులు టి.గోపాలచార్యులు, దేవ‌స్థానం మాజీ చైర్మ‌న్ బెల్లం మ‌ధుసూధ‌న‌రావు, గంప‌ల గూడెం మాజీ జెడ్పీటీసీ స‌భ్యులు పామ‌ర్తి కొండ‌ల‌రావు, దేవ‌స్థానం మాజీ స‌భ్యులు చిన్న అనంత‌రామ‌య్య ల‌తో పాటు ఆల‌య సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply