Nellore | టిడిపి నేత దారుణ హత్య – మృత దేహాన్ని ముక్కలు చేసి బావిలో పడవేత

నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేత దారుణ హత్యకు గురయ్యాడు.. నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది.. తాతా హోటల్‌ పక్కన జంపాలవారిపాలెంలో టీడీపీ నేత తోపూరి నరసింహంను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు బ్రహ్మయ్య… అంతటితో ఆగకుండా.. రెండు రోజులు నరసింహం మృతదేహాన్ని ముక్కలుగా నరికి బోరుబావిలో వేశాడు.. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది..

అయితే, నరసింహం నిమ్మతోట దగ్గర కాపలాదారుడిగా పనిచేస్తున్నాడట బ్రహ్మయ్య.. ఏ విషయంలో ఆ ఇద్దరి మధ్య వివాదం మొదలైంది.. నరసింహంను అంత దారుణంగా ఎందుకు హత్య చేశాడు లాంటి విషయాలు తెలియాల్సి ఉండగా.. నరసింహం కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో బ్రహ్మయ్యను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.. బోరుబావి దగ్గరకు వెళ్లి ఆధారాలను సేకరించే పనిలోపడిపోయారు..

Leave a Reply