నెల్లూరు డీఆర్సీ సమావేశం ప్రారంభం

నెల్లూరు డీఆర్సీ సమావేశం ప్రారంభం

నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ : నెల్లూరు జెడ్పీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల(Collector Himanshu Shukla) అధ్యక్షతన, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్యఅతిథిగా డిస్టిక్ రివ్యూ కమిటీ (DRC) సమావేశం శ‌నివారం ఉద‌యం 11 గంట‌ల‌కు ప్రారంభ‌మైంది. సమీక్షలో రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీద మస్తాన్ రావు(Beda Mastan Rao) పాల్గొన్నారు.

సమావేశంలో ముందుగా వ్యవసాయం, ఇరిగేషన్ పై సమగ్ర చర్చ ప్రారంభ‌మైంది. స‌మావేశంలో ఎమ్మెల్సీలు బల్లి కల్యాణ్ చక్రవర్తి, తూమాటి మాధవరావు, శాసన సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కాకర్ల సురేష్, కృష్ణా రెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు(Inturi Nageswara Rao) పాల్గొన్నారు.

Leave a Reply