NDA | కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ

NDA | కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ
- పంపిణీ చేసిన పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా
NDA | పామర్రు – ఆంధ్రప్రభ : కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భూమి హక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాల చట్టం, 1971 – రీసర్వే చేసిన గ్రామాల్లో రాజకీయ పార్టీల లోగోలు, పేర్లను తొలగించి ప్రభుత్వ చిహ్నంతో కొత్త పాస్ పుస్తకాలను కూటమి ప్రభుత్వం జారీ చేయడం జరిగినది.
ఇవాళ పామర్రు మండలంలోని యలకుర్రు గ్రామం 303, నెమ్మలూరు గ్రామం 392, ప్రకర్ల గ్రామం 212, మొత్తం 907 “కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను” పామర్రు MLA వర్ల కుమార్ రాజా చేతుల మీదుగా రైతులకు పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో పామర్రు ఏఎంసి చైర్మన్ జన్ను శోభన్ బాబు, వారితో పాటు అధికారులు, సీనియర్ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
