Naveen Polishetty | కెరీర్‌లోనే అతిపెద్ద విజయం..

Naveen Polishetty | కెరీర్‌లోనే అతిపెద్ద విజయం..
Naveen Polishetty | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మూడు వరుస ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నవీన్ పొలిశెట్టి.. తాజా సంచలన విజయం అనగనగా ఒక రాజుతో మరో స్థాయికి చేరుకున్నారు. ఈ చిత్రం నవీన్ పొలిశెట్టి కెరీర్‌లోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా (Block Buster) నిలిచింది. థియేటర్లలో ప్రేక్షకుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ, ఈ సంక్రాంతి పండుగను మరింత వైభవంగా మార్చింది. ఇంతకీ.. నవీన్ సాధించిన రికార్డ్ ఏంటి..?
Naveen Polishetty | 100 కోట్ల క్లబ్ లో రాజు..
కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 100.2 కోట్ల గ్రాస్‌ను సాధించి, బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన థియేటర్లలో అడుగుపెట్టిన అనగనగా ఒక రాజు చిత్రం, మొదటి షో నుంచే విశేష స్పందనను సొంతం చేసుకుంది. హౌస్‌ఫుల్ (Housefull) ప్రదర్శనలు, మళ్లీ మళ్లీ కుటుంబ ప్రేక్షకుల రాకతో థియేటర్లు కళకళలాడుతున్నాయి. ఫలితంగా ఇది చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. సంక్రాంతికి తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ, కేవలం నాలుగు రోజుల్లోనే అన్ని ప్రాంతాల డిస్ట్రిబ్యూటర్లు బ్రేక్ ఈవెన్ చేరుకోవడం అనేది అరుదైన ఘనతగా మారింది. అన్ని ప్రాంతాల్లోనూ సంచలన వసూళ్లతో భారీ విజయాన్ని సాధించింది.

Naveen Polishetty | కొద్దిమందికే దక్కిన అరుదైన విజయం..
ఈ సంచలన విజయంతో, నవీన్ పొలిశెట్టి తన నాలుగో వరుస బ్లాక్‌బస్టర్‌ను సాధించి, తెలుగు సినీ పరిశ్రమలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు. ప్రతి సినిమాతో తన మార్కెట్ ని పెంచుకుంటూ వచ్చి, ఇప్పుడు అనగనగా ఒక రాజు సినిమాతో (Movie) తన సినీ ప్రయాణంలోనే అతిపెద్ద విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా మరో మైలురాయిని నమోదు చేసింది. యూఎస్‌లో నవీన్ పొలిశెట్టి వరుసగా మూడు సినిమాలతో $1 మిలియన్‌కు పైగా వసూళ్లను సాధించిన ఘనతను అందుకున్నారు. ఇది కొద్దిమందికే దక్కిన అరుదైన విజయంగా నిలిచింది. అంతేకాదు, రోజువారీ కలెక్షన్లు బలంగా కొనసాగుతుండటంతో అనగనగా ఒక రాజు ఇప్పుడు ప్రతిష్టాత్మక $2 మిలియన్ మార్క్ వైపు వేగంగా దూసుకెళ్తోంది. పండుగ సమయంలో తీవ్ర పోటీ ఉన్నప్పటికీ.. అద్భుతమైన స్క్రీన్ హోల్డింగ్, వ్యూహాత్మక ప్లేస్‌మెంట్‌తో ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ మోక్ష మూవీస్ ఈ చిత్ర భారీ విజయంలో కీలక పాత్ర పోషించింది.

Naveen Polishetty | అసలు సిసలైన సంక్రాంతి ఎంటర్టైనర్..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది అనగనగా ఒక రాజు. భారీ సంక్రాంతి పోటీ ఉన్నా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కి చెందిన డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా సినిమాకు అండగా నిలిచి, ఉత్తమ విడుదల అందించారు. కీలక ప్రాంతాల్లో తగినన్ని థియేటర్లను (Theatre) కేటాయించారు. సినిమా పై నమ్మకంతో ఈ స్థాయి విడుదల చేశారు. వారి నమ్మకాన్ని నిజం చేస్తూ ప్రేక్షకుల పెద్దఎత్తున థియేటర్లకు కదిలిరావడంతో, రికార్డు స్థాయి వసూళ్లు వస్తున్నాయి. కడుపుబ్బా నవ్వించే హాస్యం, కంటతడి పెట్టించే భావోద్వేగాలతో రూపొందిన అనగనగా ఒక రాజు చిత్రం అన్ని వయసుల వార్ని, అన్ని ప్రాంతాలకు చెందిన ప్రేక్షకులను ఆకట్టుకుంటూ అసలు సిసలైన సంక్రాంతి ఎంటర్టైనర్‌గా నిలిచింది. అనగనగా ఒక రాజు జోరు ఇప్పట్లో ఆగే సూచనలు లేవు. ఈ చిత్రం మరిన్ని మైలురాళ్లను చేరుకునే దిశగా పరుగులు పెడుతుండడం విశేషం.

