Bhupalpalli | ప్రకృతి కన్నెర్ర..హోటల్ ధ్వంసం

ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రకృతి ప్రకోపానికి అనేక ఇండ్లు నేలమట్టమ‌య్యాయి. బుధవారం రాత్రి వీచిన జోరు గాలివాన బీభత్సానికి జిల్లా కేంద్రంలోని మైసమ్మ గుడి వద్ద ఉన్న రాజు గారి పల్లె రుచులు హోటల్ పూర్తిగా ధ్వంసమైంది. హోటల్ పై కప్పు పూర్తిగా ధ్వంసం కాగా, హోటల్ లోని సామాగ్రి పూర్తిగా దెబ్బతిన్నది. నిర్వాహకులకు స్వల్ప గాయ్యాలయ్యాయి. దీంతో హోటలే జీవనధారంగా జీవిస్తున్న ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. ఈ ప్రకృతి విపత్తుతో సుమారు రూ.2లక్షల ఆస్థి నష్టం వాటిల్లింది. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.

జోరు గాలివానకు పెంకుటిల్లు ధ్వంసం..
గణపురం, మే 1 (ఆంధ్రప్రభ) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బసవరాజు పల్లి గ్రామంలో బుధవారం రాత్రి వీచిన జోరు గాలివాన బీభత్సానికి ధరావత్ రాజుకు చెందిన పెంకుటిల్లు పైకప్పు పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పైకప్పు పెంకులు ఇంట్లోని గృహాపకారణాలపై పడటంతో అవి దెబ్బతిన్నాయి. దీనితో సుమారు 70వేల వరకు ఆస్తినష్టం వాటిల్లిందని బాధితుడు రాజు తెలిపారు.

Leave a Reply