National Park | బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్

National Park | బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్
- మరో మావోయిస్టు అగ్రనేత పాపారావు మృతి ?
National Park | చర్ల, ఆంధ్రప్రభ : మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇవాళ ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నేషనల్ పార్క్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. ఇందులో భద్రతా దళాలకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న మావోయిస్టు పార్టీ దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు (డీకేఎన్‌జేఎం) పాపారావు అలియాస్ మోంగు (57) మరణించినట్లు తెలుస్తోంది. పాపారావు దండకారణ్యం ప్రాంతంలో మావోయిస్టు పార్టీలో కీలక వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది.
